Telangana: 16న ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. 17నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • 17న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
  • 18న స్పీకర్ ఎన్నిక
  • 19న గవర్నర్ ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీ కార్యకలాపాలు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల వరకూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఇందులో భాగంగా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 16న ప్రోటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ ప్రమాణ స్వీకారం, 17న ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు జరగనున్నాయి.18న స్పీకర్ ఎన్నిక అనంతరం ఆయన అధ్యక్షతన సభా కార్యక్రమాలు  జరగనున్నాయి.19న శాసనసభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం, 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వుంటాయి. 

Telangana
Assembly
MuntaZ Khan
Speaker
Narasimhan
  • Loading...

More Telugu News