nayanatara: 'ఐరా' టీజర్ విడుదల.. మరోసారి భయపెట్టబోతోన్న నయనతార

  • హారర్ థ్రిల్లర్ మూవీగా 'ఐరా'
  • ప్రధాన పాత్రధారిగా నయనతార
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న టీజర్    

నయనతార ఒక సినిమాను ఒప్పుకుందీ అంటే, ఆ కథలో కొత్తదనం ఉంటుంది అనే నమ్మకాన్ని ఆమె ప్రేక్షకుల్లో కలిగించింది. అలాగే కథలో కొత్తదనం వుంటే నయనతార తన నటనా పటిమతో మరింత సమర్ధవంతగా నడిపించగలదనే నమ్మకం దర్శక నిర్మాతలలో పెరిగిపోయింది. ఈ కారణంగానే నయనతార ఖాతాలోకి వైవిధ్యభరితమైన చిత్రాలు .. విజయాలు చేరిపోతున్నాయి.తమిళంలో ఆమె తాజా చిత్రంగా 'ఐరా' రూపొందుతోంది. కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్లో నయనతార ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. నయనతార డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తోన్న ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్లోను .. టీజర్లోను సీతాకోకచిలుకకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గతంలో 'మాయ'(మయూరి) .. 'డోరా' వంటి హారర్ థ్రిల్లర్స్ తో మెప్పించిన నయనతార, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతోందన్న మాట.                                                       

  • Loading...

More Telugu News