neerav modi: భద్రతా పరమైన కారణాల వల్లే భారత్ కు తిరిగి రాలేకపోతున్నాను: నీరవ్ మోదీ
- నేను ఏ తప్పూ చేయలేదు
- పీఎన్బీ కుంభకోణం ఓ సివిల్ ట్రాన్సాక్షన్
- అది ఓ తప్పుల తడక
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోదీకి ఆర్థిక నేరగాడి ట్యాగ్ ఇవ్వాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్ఏ కోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టారు. తనకు ఆర్థిక నేరగాడి ట్యాగ్ ఇవ్వాలన్న విషయమై నీరవ్ మోదీ స్పందిస్తూ, తాను ఏ తప్పూ చేయలేదని, పీఎన్బీ కుంభకోణం ఓ సివిల్ ట్రాన్సాక్షన్ అని, అది ఓ తప్పుల తడక అని అభివర్ణించారు. భద్రతా పరమైన కారణాల వల్లే తాను తిరిగి భారత్ కు రాలేకపోతున్నానని నీరవ్ స్పష్టం చేశారు. కాగా, ఆర్థిక నేరస్తుడు నీరవ్ పై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కుంభకోణంలో నిందితులైన నీరవ్ సహా మెహుల్ ఛోక్సీని భారత్ కు రప్పించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.