akhilesh yadav: సీబీఐ నెక్స్ట్ టార్గెట్ అఖిలేష్ యాదవ్?

  • యూపీలో 12 ప్రాంతాల్లో సీబీఐ దాడులు
  • మైనింగ్ స్కామ్ కు సంబంధించి దాడులు
  • ఎఫ్ఐఆర్ లో పలుమార్లు అఖిలేష్ పేరు

ఉత్తరప్రదేశ్ లో సీబీఐ విరుచుకుపడింది. మొత్తం 12 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఎస్పీ, బీఎస్పీలు నిర్ణయించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు ప్రారంభం కావడం గమనార్హం. మైనింగ్ స్కామ్ కు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయి. 2017లో దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎఫ్ఐఆర్ లు సిద్ధం చేసినా... ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం.

ఎఫ్ఐఆర్ లో అఖిలేష్ యాదవ్ పేరును నిందితుల జాబితాలో చేర్చనప్పటికీ... పలుమార్లు ఆయన పేరును ప్రస్తావించారు. 2012-13లో ఉత్తరప్రదేశ్ మైనింగ్ శాఖకు అఖిలేష్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు గాయత్రి ప్రజాపతి మైనింగ్ శాఖను నిర్వహించారు. ప్రస్తుత ఎఫ్ఐఆర్ లో ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్ కామత్ మిశ్రా, బీఎస్పీ నేత సంజయ్ దీక్షిత్, ఐఏఎస్ అధికారి చంద్రకళతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఛార్జ్ షీట్లు నమోదయ్యే అవకాశం ఉంది. వీటిలో అఖిలేష్ ను నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News