Pawan Kalyan: బాబాయి అడగాలే గానీ దేనికైనా రెడీ: రామ్ చరణ్

  • నచ్చని పని ఎప్పుడూ చేయను
  • ఒక్క ఫోన్ వస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం
  • ఆయన మాకు అంత దగ్గర

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వాని జంటగా తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చెర్రీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా సినిమా, పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన బాబాయి పవన్ కల్యాణ్ అడగాలే కానీ ఏం చేయడానికైనా తాను రెడీ అని చెప్పాడు. ‘పవన్‌ బాబాయికి ఎలాంటి సహకారం అందించడానికైనా సరే నేను ముందుంటాను. ఎందుకంటే.. ఆయన నా బాబాయి. ఆయన అడగాలే కానీ ఏదైనా చేస్తాం. ఆయనకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయను. ఆయన నుంచి ఒక్క ఫోన్‌కాల్‌ వస్తే చాలు మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్లి చేస్తాం. ఆయన మాకు అంత దగ్గర’ అని చెర్రీ చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan
Ramcharan
kiara adwani
Boyapati Sreenu
Vinaya Vidheya Rama
  • Loading...

More Telugu News