mumtaz ahmed khan: తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్

  • ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎంకు అవకాశం ఇచ్చిన కేసీఆర్
  • కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఒవైసీ
  • ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అహ్మద్ ఖాన్

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరనుంది. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ఎంపిక చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈసారి గెలుపొందిన ఎమ్మెల్యేలలో ముంతాజ్ అహ్మద్ ఖానే అందరికంటే సీనియర్. ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, ప్రస్తుత తెలంగాణలో కానీ ఎంఐఎం నేతకు ప్రొటెం స్పీకర్ గా అవకాశం దక్కడం ఇదే ప్రథమం. స్పీకర్ ను ఎంపిక చేసేంత వరకు సభను అహ్మద్ ఖాన్ నిర్వహించనున్నారు. ఛార్మినార్ నియోజకవర్గం నుంచి అహ్మద్ ఖాన్ గెలుపొందారు.

mumtaz ahmed khan
telangana
protem speaker
assembly
kcr
Asaduddin Owaisi
TRS
mim
  • Loading...

More Telugu News