charan: 'అజర్ బైజాన్'లో చరణ్ చేసిన ఫైట్ హైలైట్ అవుతుందట!

- యాక్షన్ సినిమాలపై బోయపాటి మార్కు
- చరణ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్
- యాక్షన్ ఎపిసోడ్ గురించే ఫిల్మ్ నగర్లో టాక్
మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో సినిమాలు తెరకెక్కించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. ఇక మాస్ హీరోగా చరణ్ కి వున్న క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో 'వినయ విధేయ రామ' నిర్మితమైంది. చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో తొలిసారిగా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు తెరదించేస్తూ ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
