West Bengal: కాసేపు రాజకీయాలు పక్కన...షటిల్ ఆడి ఆకట్టుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి దీదీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-e632bb7afd2113329bc1109e5bca334e09393b79.jpg)
- డబుల్స్ ఆడి సత్తాచాటిన మమతా బెనర్జీ
- బిర్‌భూమ్ జిల్లా బోల్‌పుర్‌లోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో ఆట
- సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిగా తిలకిస్తున్న నెటిజన్లు
నిత్యం రాజకీయ క్రీడా మైదానంలో ఎత్తుకు పైఎత్తులు, వ్యూహాలతో బిజీగా గడిపే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాసేపు రాజకీయాలు పక్కన పెట్టారు. బ్యాట్ అందుకుని కాసేపు షటిల్ కోర్టులో తన ప్రతిభ చాటారు. మరో ముగ్గురు క్రీడాకారులతో కలిసి డబుల్స్ ఆడారు.
గురువారం రాత్రి చోటు చేసుకున్న ఈ క్రీడా వినోదాన్ని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బిర్‌భూమ్ జిల్లా బోల్‌పుర్‌లోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో 63 ఏళ్ల మమత తన ప్రావీణ్యం చాటారు. ఆమె బాదిన స్మాష్‌లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
We love sports.
— Mamata Banerjee (@MamataOfficial) January 4, 2019
A token game in a village... pic.twitter.com/rSb61JZN4d