charan: చరణ్ గురించి కైరా అద్వాని ఆ సీక్రెట్ చెప్పేసింది!

  • చరణ్ జోడీగా కైరా అద్వాని 
  • జనవరి 11వ తేదీన విడుదల
  • రంగంలోకి దిగిపోయిన ఫ్యాన్స్    

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కైరా అద్వాని బిజీగా కింది. తాజా ఇంటర్వ్యూలో చరణ్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ను సరదాగా ఆమె బయటపెట్టింది.

చరణ్ కి ఫేస్ బుక్ లో మాత్రమే ఎకౌంట్ వుంది. ట్విట్టర్ .. ఇంస్టా గ్రామ్ లలో చరణ్ లేడు. అయితే ఈ విషయాన్ని గురించి కైరా మాట్లాడుతూ .. "సీక్రెట్ ఎకౌంట్ ద్వారా చరణ్ ఇంస్టా గ్రామ్ లో అప్ డేట్స్ చూస్తుంటాడు. ఇంస్టా గ్రామ్ లో ఎక్కువ సమయం గడపడం అంటే చరణ్ కి చాలా ఇష్టం. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతుంటాడు" అని చెప్పింది. దాంతో ఆయన ఇంస్టా గ్రామ్ అకౌంట్ తెలుసుకోవడం కోసం అభిమానులు రంగంలోకి దిగిపోయారట. 

  • Loading...

More Telugu News