KCR: రేపటి నుంచి వారం పాటు కేసీఆర్ దుబాయ్ పర్యటన

  • వారం పాటు దుబాయ్, యూఏఈలలో పర్యటన
  • పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం
  • కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ముఖ్య నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం దుబాయ్ వెళ్లనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు దుబాయ్, యూఏఈలలో పర్యటిస్తారు. ఆయన వెంట సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఐఏఎస్‌ అధికారులు అర్వింద్ కుమార్, జయేష్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు కొందరు సీఎం వెంట వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పర్యటించనున్న కేసీఆర్ పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్ తొలిసారి 2014లో సింగపూర్‌లో పర్యటించారు. ఆ తర్వాత చైనా, హాంకాంగ్‌లలో పర్యటించారు. మళ్లీ రేపు విదేశీ పర్యటనకు బయలుదేరబోతున్నారు.

KCR
Telangana
Dubai
UAE
Hyderabad
  • Loading...

More Telugu News