Chandrababu: ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. చంద్రబాబు సైగ చేస్తే రోడ్ల మీద తిరగలేరు!: బీజేపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ హెచ్చరిక

  • చంద్రబాబును అడ్డుకోవడం సరికాదు
  • పవన్ పోటీ చేస్తే టీడీపీకి నష్టమేమీ లేదు
  • కేసీఆర్, జగన్.. మోదీకి తొత్తులు

ఏపీ సీఎం చంద్రబాబు సైగ చేస్తే బీజేపీ వాళ్లు రోడ్లపై మీద కూడా తిరగలేరని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు చంద్రబాబును అడ్డుకోవడం సరికాదని... బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పవన్ కల్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తే టీడీపీకి నష్టమేమీ లేదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. కేసీఆర్, జగన్.. మోదీకి తొత్తులుగా మారారని ఆయన విమర్శించారు.

Chandrababu
Babu Rajendra Prasad
Telugudesam
BJP
Pawan Kalyan
Jagan
KCR
Narendra Modi
  • Loading...

More Telugu News