modi: 8 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం.. 4 పథకాలకు శంకుస్థాపన చేసిన మోదీ
- నేడు మణిపూర్ లో పర్యటించిన మోదీ
- 125 కోట్లతో నిర్మించిన ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్టును ప్రారంభించిన పీఎం
- ధనమంజురి యూనివర్శిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి శంకుస్థాపన
ప్రధాని మోదీ ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 8 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో మోరేలో ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్ట్, దొలైతాబీ బ్యారేజ్, ఆహార నిల్వ గోడౌన్, ఒక రిజర్వాయర్, నోనీ జిల్లాలో టూరిస్ట్ డెస్టినేషన్, వాటర్ సప్లై స్కీమ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్టును రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇది కేవలం చెక్ పోస్టు మాత్రమే కాదని... ఇందులో డజన్ల కొద్దీ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
ఈ పర్యటనలో నాలుగు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ధనమంజురి యూనివర్శిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేశారు. దీంతో పాటు, ఇంపాల్ తూర్పు జిల్లాలోని ఖుమన్ లాంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో హాకీ స్టేడియం, ప్రధాన స్డేడియంలకు లైట్ల ఏర్పాటు... ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని గ్రౌండ్ లో ఆస్ట్రోటర్ఫ్ వేసే కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.