Suman Paul: విమానం టేకాఫ్ అవగానే.. స్పృహతప్పి మృతి చెందిన బాలుడు
- అనారోగ్యంతో బాధపడుతున్న సుమన్
- చికిత్స కోసం తీసుకెళుతున్న కుటుంబ సభ్యులు
- విమానం అత్యవసర ల్యాండింగ్
ఇటీవల కోల్‌కతా - బెంగుళూరు విమానంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం మరువక ముందే మరో ఘటన జరిగింది. ఇది కూడా కోల్‌కతా - బెంగుళూరు విమానంలోనే జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న 16 ఏళ్ల సుమన్ పాల్ అనే బాలుడిని చికిత్స నిమిత్తం అతని కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లే నిమిత్తం విమానం ఎక్కారు.
అయితే, విమానం టేకాఫ్ అవుతుండగానే సుమన్ స్పృహ తప్పాడు. వెంటనే క్యాబిన్ సిబ్బంది పైలట్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన సుమన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అయితే పూర్తి అనారోగ్యంతో ఉన్న బాలుడిని విమానంలో ప్రయాణించేందుకు ఎలా అనుమతించారన్న దానిపై విమానాశ్రయ వర్గాలు విచారణ నిర్వహిస్తున్నాయి.