Andhra Pradesh: నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా.. మీరంతా ఫినిష్ అయిపోతారు!: బీజేపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

  • కాకినాడలో చంద్రబాబుకు నిరసనల సెగ
  • సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేపీ నేతలు
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈరోజు నిరసనల సెగ తగిలింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కాన్వాయ్ ను బీజేపీ నేతలు ఈరోజు అడ్డుకున్నారు. కాకినాడ జేఎన్టీయూలో జరుగుతున్న ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమానికి సీఎం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నేతలు, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

తొలుత ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నించారు. అయితే ఆందోళనకారులు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో ఆయన సహనం కోల్పోయారు. ‘కొంచమైనా సిగ్గు ఉందా మీకు? మోదీ చేసిన పనులకు మీరంతా సిగ్గుపడాలి. మోదీ రాష్ట్రానికి ద్రోహం చేశారు. నన్ను డౌన్ డౌన్ అనడం కాదయ్యా. మీ అందరినీ జనాలు తరిమికొడతారు. లేనిపోని సమస్యలు పెట్టుకోవద్దు. మీరు ఫినిష్ అయిపోతారు.

నిన్న కూడా తెలుగువాళ్ల మీద ఢిల్లీలో లాఠీచార్జ్ చేయించారు. ఈ గడ్డపై ఉంటూ, ఇక్కడి నీళ్లు తాగుతూ, ఇక్కడి గాలిని పీలుస్తున్నప్పుడు కమిట్ మెంట్ ఉండాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Andhra Pradesh
Chandrababu
BJP
convey stopped
warning
kakinada
  • Loading...

More Telugu News