balakrishna: బాలకృష్ణ ఆలోచన మాత్రం అదే!

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'ఎఫ్ 2'
  • తదుపరి సినిమా బాలకృష్ణతో 
  • తన బ్యానర్లో చేయాలనే ఆసక్తితో దిల్ రాజు

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్'.. ' ఎఫ్ 2' సినిమాలకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి .. బాలకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. బోయపాటితో చేయవలసిన సినిమా తరువాత బాలకృష్ణ .. అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈలోగా అందుకు సంబంధించిన స్క్రిప్ట్ తో పాటు మిగతా పనులను అనిల్ రావిపూడి పూర్తి చేయనున్నాడు.

అనిల్ రావిపూడితో గల సాన్నిహిత్యం కారణంగా .. ఆయనపై గల నమ్మకం వలన ఆయన బాలకృష్ణతో చేయనున్న సినిమాకి నిర్మాతగా ఉండటానికి దిల్ రాజు ఉత్సాహాన్ని చూపుతున్నారట. అయితే బాలకృష్ణ ఇక నుంచి తన సినిమాలన్నీ తన సొంత బ్యానర్ అయిన 'ఎన్ బీ కే'లోనే చేయాలనే నిర్ణయంతో వున్నారు. మరి ఈ సినిమా విషయంలో ఆయనను అనిల్ రావిపూడి .. దిల్ రాజు ఒప్పించగలరో లేదోననేది ఆసక్తికరంగా మారింది.

balakrishna
anil ravipoodi
dil raju
  • Loading...

More Telugu News