Andhra Pradesh: చంద్రబాబు దావోస్ పర్యటనపై ఆంక్షలతో మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారు!: నారా లోకేశ్

  • ఏపీ ప్రభుత్వాన్ని మోదీ వేధిస్తున్నారు
  • ఆంధ్రాకు పరిశ్రమలు వస్తే దేశానికి వచ్చినట్లే
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు వేధిస్తోందని టీడీపీ నేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఏపీకి పరిశ్రమలు వస్తే భారత్ కు పరిశ్రమలు వచ్చినట్లు కాదా? అని నిలదీశారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతీ ఏటా జరిగే ప్రపంచ వాణిజ్య సదస్సు(డబ్ల్యూఈఎఫ్)లో చంద్రబాబు పాల్గొనడం వల్ల ఏపీకి చాలా లాభం చేకూరిందని మంత్రి తెలిపారు.

ఇప్పుడు చంద్రబాబు దావోస్ పర్యటనపై అర్థంలేని ఆంక్షలు విధిస్తూ మోదీ ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఈ వేధింపులకు గురికావడానికి తెలుగువారు చేసిన తప్పేమిటి? అని లోకేశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఏపీ మంత్రి ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
Nara Lokesh
Narendra Modi
BJP
davos
sanctions
  • Loading...

More Telugu News