anil ambani: అనిల్ అంబానీని జైల్లో పెట్టండి: సుప్రీంకోర్టులో ఎరిక్సన్ పిటిషన్

  • ఎరిక్సన్ కు రూ. 550 కోట్ల మేర చెల్లించాల్సిన అంబానీ
  • గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు
  • మళ్లీ పిటిషన్ వేసిన ఎరిక్సన్

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని జైల్లో ఉంచాలంటూ సుప్రీంకోర్టులో స్వీడన్ కు చెందిన టెలికాం ఉత్పత్తుల తయారీదారు ఎరిక్సన్ పిటిషన్ వేసింది. తమ బకాయిలను చెల్లించాలంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించినా... అనిల్ అంబానీ పట్టించుకోలేదని పిటిషన్ లో ఎరిక్సన్ ఆరోపించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను కూడా అంబానీ ఉల్లంఘించారని తెలిపింది. ఎరిక్సన్ కు అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 550 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. మరోవైపు, స్పెక్ట్రం అమ్మకం కేసు కోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉందని... అందువల్లే చెల్లింపులు చేయలేకపోయామని కోర్టుకు అనిల్ అంబానీ తరఫు న్యాయవాది తెలిపారు.

anil ambani
ericsson
Supreme Court
reliance communications
  • Loading...

More Telugu News