Andhra Pradesh: రాయలసీమ ముఠా నాయకుడిలా మోదీ తయారయ్యాడు!: జేసీ దివాకర్ రెడ్డి

  • రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు
  • మోదీ అబద్ధాలు చెప్పడం సరికాదు
  • ఢిల్లీలో మీడియాతో టీడీపీ నేత

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని టీడీపీ నేత, పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పాలిట కాంగ్రెస్ పార్టీ దుష్టశక్తిగా మారితే, ఇవాళ బీజేపీ దేశమంతటికీ దుష్టశక్తిగా మారిందని విమర్శించారు. ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో ప్రధాని మోదీ అబద్ధాలు మాట్లాడటం సమంజసమేనా? అని జేసీ ప్రశ్నించారు. ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాయలసీమలో ముఠా నాయకుడి తరహాలో మోదీ వ్యవహరిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా, ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా టీడీపీ నేతలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఇలా శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకూ కాకుండా పూర్తికాలం తమను తొలగిస్తే ఓ పని అయిపోతుందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
JC
DIWAKAR REDDY
Telugudesam
Narendra Modi
  • Loading...

More Telugu News