jhanvi kapoor: విజయ్ దేవరకొండ అంటే క్రష్: జాన్వీ కపూర్

  • 'కాఫీ విత్ కరణ్'లో విజయ్ దేవరకొండ ప్రస్తావన 
  • వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలోను అతని మాటే 
  • 'ఇంకేం ఇంకేం కావాలే' పాట అంటే ఇష్టం

విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనతో కలిసి నటించడానికి యువ కథానాయికలు పోటీ పడుతుంటే, ఆయన సినిమాల పట్ల ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ .. విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.

తెల్లవారి నిద్రలేచే సరికి మేల్ యాక్టర్ గా మారిపోవలసి వస్తే ఎవరిలా మారిపోవాలనుకుంటారు? అనే ప్రశ్నకి ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఆమె విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించింది. 'ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది? పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది?' అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరునే చెప్పేసింది. 'గీత గోవిందం'లోని 'ఇంకేం ఇంకేం కావాలే ..' అనే సాంగ్ అంటే తనకి ఇష్టమనీ .. చాలాసార్లు విన్నానని చెప్పడం విశేషం.   

jhanvi kapoor
  • Loading...

More Telugu News