APSRTC: సంక్రాంతికి హైదరాబాదు నుంచి 4,600 స్పెషల్ బస్సులు!

  • 9 నుంచి 15 వరకూ బస్సులు
  • రోజుకు 1000కి పైగా బస్సులు నడిపిస్తాం
  • వెల్లడించిన తెలుగురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, సంక్రాంతి పర్వదినాలను గడిపి వచ్చే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ కలసి హైదరాబాదు నుంచి దాదాపు 4,600 ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమన్వయ సమావేశం నిర్వహించగా, వీలైనన్ని ఎక్కువ బస్సులను అందుబాటులో ఉంచాలని, గత సంవత్సరంతో పోలిస్తే మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. 2018లో 3,200 బస్సులను తిప్పామని గుర్తు చేసిన అధికారులు, ఈ సంవత్సరం రద్దీ మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తూ, బస్సుల సంఖ్యను పెంచినట్టు తెలిపారు.

ఈ సంక్రాంతి సీజన్ లో 12వ తేదీ శనివారం, 13 ఆదివారం రావడంతో రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. రోజుకు 1000కి తక్కువ కాకుండా బస్సులను సిద్ధం చేస్తామని, ఏ ప్రాంతానికి డిమాండ్ ఉంటే, అక్కడికి పంపుతామని టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ పీ కొమురయ్య వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి, ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎల్బీ నగర్ లోని చింతలకుంట నుంచి బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లే బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నడిపిస్తామని అన్నారు. కర్నూలు, అనంతపురం, బెంగళూరు, కడప, చిత్తూరు బస్సులు ఎంజీబీఎస్ నుంచి, వరంగల్ బస్సులు ఉప్పల్ నుంచి బయలుదేరుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News