ramojirao: రామోజీరావును ఎన్టీఆర్ చంపాలనుకున్నారు: నాదెండ్ల భాస్కరరావు సంచలన ఆరోపణలు

  • ఒకసారి నా భార్యతో కలసి శ్రీశైలం వెళ్లా
  • కంచి స్వామి నుంచి నాకు పిలుపు వచ్చింది
  • 20 రోజుల్లో రామోజీని చంపబోతున్నారంటూ ఆయన చెప్పారు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును చంపేందుకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుట్ర పన్నారంటూ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్యతో కలసి ఒకసారి శ్రీశైలం వెళ్లానని... స్వామివారి దర్శనం చేసుకుని, గెస్ట్ హౌస్ కు వెళ్లానని.... అప్పుడు కంచి స్వామి శంకరాచార్య నుంచి తనకు పిలుపువచ్చిందని తెలిపారు.

 తాను ఆయన వద్దకు వెళ్లానని... ఆయన తలుపు వేసి... మీకు, ఎన్టీఆర్ కు మధ్య చిచ్చుపెట్టింది రామోజీరావేనని... అందుకే ఒక 20 రోజుల్లో ఆయనను తప్పించేస్తున్నారని అన్నారని చెప్పారు. మీరు, ఎన్టీఆర్ మళ్లీ కలవాలని... ఈ రాత్రికి ఎన్టీఆర్ కూడా ఇక్కడకు వస్తున్నారని చెప్పారని తెలిపారు. దీనికి సమాధానంగా ఎన్టీఆర్ తో తాను కలవడం అసాధ్యమని చెప్పానని అన్నారు. ఈ కుట్ర గురించి తనకు ఏమీ తెలియదని... ఆయన తనతో చెప్పిన విషయాన్నే తాను మీకు చెబుతున్నానని తెలిపారు.

చంద్రబాబుకు మద్దతుగానే ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రామోజీరావు వ్యవహరించారని నాదెండ్ల తెలిపారు. ఎన్టీఆర్ తో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులంతా ఏకమై... ఆయన మరణానికి కారణమయ్యారని తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.  

ramojirao
ntr
nadendla bhaskar rao
kill
  • Loading...

More Telugu News