Telangana: తెలంగాణ కొత్త సెక్రటేరియట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

  • కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు
  • పిటిషన్లను తిరస్కరించాలని కోరిన ఏఏజీ
  • అడ్డంకులు తొలగిపోతే.. రాష్ట్ర ప్రభుత్వానికి స్థలం బదలాయింపు 

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హైకోర్టుకు తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ తెలిపారు. సికింద్రాబాద్ లోని బైసన్ పోలో జింఖానా గ్రౌండ్స్ లో సచివాలయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. పాత సచివాలయాన్ని వదిలేసి, కొత్త సెక్రటేరియట్ ను నిర్మించాల్సిన అవసరం ఏముందంటూ... కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని... ఈ పిటిషన్లను తిరస్కరించాలని కోరారు. ఈ అడ్డంకులు తొలగిపోతే ఆ గ్రౌండ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై ఈనెల 29న విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News