Team India: డబుల్ సెంచరీకి చేరువలో పుజారా.. భారీ స్కోరు దిశగా భారత్

  • ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్న పుజారా
  • నాలుగో ‘డబుల్’పై కన్ను
  • లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 389/5

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా నయావాల్ చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలిరోజు స్కోరు 303/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ కాసేపటికే హనుమ విహారి (42) వికెట్‌ను కోల్పోయింది. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన పుజారా ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. కెరీర్‌లో నాలుగో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అనవసర షాట్లకు పోకుండా ఆచితూచి ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అతడికి అండగా ఉన్నాడు. లంచ్ సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. పుజారా 181, పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Team India
Australia
Sydney test
Cheteshwar Pujara
Rishabh Pant
  • Loading...

More Telugu News