Vijayashanthi: జైలులో శశికళను కలిసిన విజయశాంతి.. గంటకుపైగా మంతనాలు

  • పరప్పణ అగ్రహార జైలులో శశికళతో భేటీ
  • కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై ఆరా
  • అందులో చేరితే ఎలా ఉంటుందన్న శశికళ

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళతో కాంగ్రెస్ నేత విజయశాంతి భేటీ అయ్యారు. కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళతో విజయశాంతి గంటకు పైగా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫెడరల్ ఫ్రంట్‌పై శశికళ ఆరా తీసినట్టు సమాచారం. ఆ కూటమిలో చేరితే ఎలా ఉంటుందన్న విషయంపైనా విజయశాంతితో శశికళ చర్చించినట్టు తెలుస్తోంది.

శశికళతో విజయశాంతికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను విజయశాంతి పలుమార్లు కలిశారు. ఇటీవల ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్‌కు మద్దతుగా విజయశాంతి ప్రచారం కూడా నిర్వహించారు. వీరిద్దరి తాజా కలకయిక మరోమారు ప్రాధాన్యం సంతరించుకుంది.

Vijayashanthi
Sasikala
AIADMK
Congress
Karnataka
Parappana agrahara
KCR
  • Loading...

More Telugu News