IT Raids: పన్ను ఎగవేతపై ఫిర్యాదులు అందడంతో.. తమిళనాడులో ఐటీ అధికారుల మెరుపు దాడులు

  • తనిఖీల్లో 100 మందికి పైగా అధికారులు
  • ఆదాయానికి, పన్నులకు పొంతన లేదు
  • 32 ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు

పన్ను ఎగవేతపై ఫిర్యాదులు అందడంతో తమిళనాడులోని 32 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చెన్నైలోని శరవణ భవన్, గ్రాండ్స్ స్వీట్స్, అంజప్పర్ గ్రూప్, హాట్ బ్రెడ్స్ సహా పలు ప్రముఖ రెస్టారెంట్ సంస్థల్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 100 మందికి పైగా ఐటీ అధికారులు పాల్గొన్నారు. ఈ సంస్థలన్నిటికీ వస్తున్న ఆదాయానికి, కడుతున్న పన్నులకు పొంతన లేదంటూ వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని.. మరిన్ని ఆధారాల కోసమే సోదాలు నిర్వహించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.

IT Raids
Chennai
Saravana Bhavan
Hot Breads
Anjappar Group
  • Loading...

More Telugu News