Arun Jaitly: 66 కేసులు పరిష్కారమైతే.. రూ.80 వేల కోట్లు వస్తాయి: అరుణ్ జైట్లీ
- మొండి బకాయిల రికవరీ
- ఎన్డీఏ చర్యలు చేపడుతోంది
- ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారం
మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల రికవరీకి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నేడు ఆయన తన ఫేస్‌బుక్ బ్లాగ్‌పోస్టులో దీనిపై పలు విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.70 వేల కోట్ల మొండి బకాయిలను కమర్షియల్ బ్యాంకులు రికవరీ చేసే అవకాశం ఉందన్నారు.
ఎస్సార్ స్టీల్ ఇండియా లిమిటెడ్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ తదితర కేసులు ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశముందన్నారు. ఈ కేసులను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ పరిష్కరిస్తోందన్నారు. మొత్తంగా 66 కేసులు పరిష్కారమైతే రుణదాతలకు రూ.80 వేల కోట్లు వస్తాయని జైట్లీ వెల్లడించారు.