Drugs: కోట్ల విలువైన డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

  • గుజరాత్ నుంచి తరలింపు
  • ‘ఆల్ప్రాజోలం’కు త్వరగా బానిసలవుతారు
  • నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది

కామారెడ్డిలో కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమవడం పెను సంచలనంగా మారింది. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. గుజరాత్ నుంచి ఆల్ప్రాజోలం అనే మత్తుమందును కొందరు హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఈ మత్తు మందు వాడిన వాళ్లు త్వరగా దానికి బానిసలవుతారని, నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు స్మగ్లర్లను, ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Drugs
Gujarath
Hyderabad
DRI Officers
  • Loading...

More Telugu News