Parliament: పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలపై లాఠీచార్జి

  • ప్రత్యేక హోదా, రైల్వేజోన్ డిమాండ్లు
  • రెండు రోజులుగా నిరసనలు
  • అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు

ప్రత్యేక హోదా సాధన సమితి నేతలపై ఢిల్లీ పోలీసులు లాఠీ చార్జి చేశారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఢిల్లీలో రెండు రోజులుగా నిరసనలు చేపట్టాయి. వీరి ఆందోళనకు టీడీపీ ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, అలాగే ప్రత్యేక హోదా, రైల్వే జోన్ తదితర డిమాండ్లతో సాధన సమితి నేడు పార్లమెంట్ ముట్టడికి యత్నించింది. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని లాఠీ చార్జి చేశారు.

Parliament
Delhi Police
Telugudesam
Central Government
Andhra Pradesh
  • Loading...

More Telugu News