Andhra Pradesh: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. సొంతంగా డబ్బులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం!
- అటాచ్ కాని ఆస్తుల కొనుగోలుకు నిర్ణయం
- రూ.300 కోట్ల మేర నిధుల పంపకానికి ఆమోదం
- నేడు అగ్రిగోల్డ్ విషయమై ఆందోళనకు దిగిన వైసీపీ
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట ఇచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో విచారణ సంస్థలు జప్తు చేయని ఆస్తులను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుకు అంగీకరించింది.
తొలి విడతలో భాగంగా రూ.5,000 మేరకు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు నగదును చెల్లిస్తామని పేర్కొంది. ఈ విషయంలో అగ్రిగోల్డ్ బాధిత సంఘంతో కలిసి హైకోర్టులో ఉమ్మడి అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో వైసీపీ ఈరోజు ఏపీ అంతటా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.