Ranga Reddy District: పక్క రాష్ట్రాలకూ విస్తరిస్తున్న శబరిమల వివాదం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b09edb4be6e70967f832bf31db83d50df3551f31.jpg)
- రంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై ఆందోళన
- మహిళల ఆలయ ప్రవేశంపై అయ్యప్ప స్వాముల ఆగ్రహం
- భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన
కేరళ రాష్ట్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎగసిన నిరసన సెగలు పక్క రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుకుగూడలో శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాములు ఆందోళన చేపట్టారు. తుక్కుగూడలోని అయ్యప్ప స్వామి ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలిపారు. శ్రీశైలం హైవే వద్దకు వచ్చాక అక్కడ ఆందోళన చేపట్టారు. కేరళ ప్రభుత్వం, హిందూ వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొనగా, కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.