nagababu: నాగబాబుగారు తిడతారు .. మంచి భోజనమూ పెడతారు: గెటప్ శీను

- నాగబాబుగారికి పూర్తి అవగాహన వుంది
- షోను లైట్ తీసుకోవద్దని చెబుతారు
- స్కిట్ సరిగ్గా రాకపోతే మందలిస్తారు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా గెటప్ శీను ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. వివిధ రకాల గెటప్స్ తో ఆయన బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్విస్తుంటాడు. అలాంటి శీను తాజా ఇంటర్వ్యూలో నాగబాబు గురించి ప్రస్తావించాడు. జబర్దస్త్ కార్యక్రమంలో ఏ టీమ్ లో ఎవరు ఏ స్థాయిలో కామెడీని పండించగలరనే విషయంలో నాగబాబుగారికి పూర్తి అవగాహన వుంది. ఆ స్థాయిలో ఆ టీమ్ లోని వాళ్లు చేయకపోతే వెంటనే ఆయన పిలిపిస్తారు.
