Nirmal District: కట్టుకున్న భర్తే ఫోన్ లో వేధిస్తుంటే... తట్టుకోలేక యువతి ఆత్మహత్య!

  • మూడేళ్ల క్రితం సోనిక, ఉదయ్ వివాహం
  • ఉద్యోగాన్ని వదిలేయడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చిన సోనిక
  • నిత్యమూ వేధిస్తుంటే మనస్తాపంతో ఆత్మహత్య

కట్టుకున్న భర్తే, నిత్యమూ ఫోన్ లో వేధిస్తుంటే, ఆ మాటలు విని తట్టుకోలేకపోయిన ఓ వివాహిత తనువు చాలించిన ఘటన నిర్మల్ లో కలకలం రేపింది. పట్టణ సీఐ జాన్ దివాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మూడు సంవత్సరాల క్రితం సోనికా రెడ్డి, తిమ్మాపూర్ కు చెందిన ఉదయ్ కిరణ్ రెడ్డికి వివాహం జరిగింది. ఉదయ్ హైదరాబాద్ లో జాబ్ చేస్తుండటంతో, ఇద్దరూ అక్కడే కాపురం ఉండేవారు.

కొన్నాళ్లకు ఉదయ్ ఉద్యోగాన్ని వదిలివేయడంతో, ఇల్లు జరగడం కష్టంకాగా, సోనిక తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఫోన్ చేసి మాట్లాడుతున్న ఉదయ్, నిత్యమూ ఆమెను వేధించసాగాడు. వారిద్దరి మధ్యా ఘర్షణ జరుగుతుండేది. భర్త సూటిపోటి మాటలతో మనస్తాపానికి గురైన ఆమె, తన బంధువులను కలిసి వస్తానని చెప్పి, ఓ అపార్ట్ మెంట్ కు వెళ్లి, అక్కడి ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని సోనిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Nirmal District
Sonika Reddy
Uday
Sucide
Harrasment
  • Loading...

More Telugu News