East Godavari District: కోడిపందాలు కావాలంటూ గోదావరి జిల్లాల్లో ప్లెక్సీలు!

  • జల్లికట్టు తరహాలో అనుమతి ఇవ్వండి
  • కోరుతున్న 'తెలుగువారి సంప్రదాయాల పరిరక్షణ కమిటీ'
  • పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పేరు చెబితే గుర్తుకు వచ్చే వాటిల్లో రంగవల్లులు, గొబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టింది పేరన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకున్నా, పండగ రోజుల్లో ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ప్లెక్సీలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఆంధ్రాలో సంక్రాంతి పండగ రోజులలో కోడిపందాలకు అనుమతి ఇవ్వాలని 'తెలుగువారి సంప్రదాయాల పరిరక్షణ కమిటీ' పేరిట ఇవి వెలిశాయి.

East Godavari District
West Godavari District
Jallikattu
Kodi Pandelu
  • Loading...

More Telugu News