Prakash Raj: కేటీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ.. తనకు రాజకీయ స్ఫూర్తి ఆయనేనన్న నటుడు!

  • రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన మరునాడే భేటీ
  • కేటీఆరే తనకు స్ఫూర్తి అంటూ ట్వీట్
  • ఒక్కరి మీద పోరాటానికి కాదన్న నటుడు

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకటించిన నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన ప్రకాశ్ రాజ్ ఆ మరుసటి రోజే కేటీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆయనతో దిగిన ఫొటోను ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తన రాజకీయ ప్రవేశానికి కేటీఆరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. తనకు స్పూర్తిదాయక మద్దతు ఇచ్చినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొందరిమీద పోరాటానికి తాను రాజకీయాల్లోకి రావడం లేదని, సమాజం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. ఇక నుంచి తన పోరాటాన్ని పార్లమెంటులోనూ కొనసాగిస్తానని ట్వీట్‌లో ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

Prakash Raj
Tollywood
Actor
KTR
TRS
Telangana
Hyderabad
  • Loading...

More Telugu News