Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సెంటిమెంట్లు లేవంటున్న అనుపమ
  • బన్నీ సినిమా హీరోయిన్ కోసం వేట 
  • హైదరాబాద్ వస్తున్న రజనీకాంత్

*  కొత్త ఏడాది సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది తనకు అలవాటు లేదని అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'మంచి నిర్ణయం అని ఎప్పుడు ఏది అనిపిస్తే అప్పుడే తీసేసుకుంటాను. ఇక దానిని ఫలానా రోజు నుంచే అమలు చేయాలని ఎదురుచూస్తూ కూర్చోను. మనకి అలాంటి సెంటిమెంట్లు లేవు' అని చెప్పింది.
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తాజాగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలోని హీరోయిన్ ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలో ఒకరిని ఎంపిక చేస్తారు.
*  రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన 'పేట' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 6న హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఆ నాటి సాయంకాలం నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే ఈ వేడుకకు రజనీకాంత్ కూడా విచ్చేస్తారు.

Anupama
Allu Arjun
trivikram
rajanikanth
  • Loading...

More Telugu News