Maruthi: మారుతి కంపెనీకి ట్యాగ్ చేయబోయి.. సినీ డైరెక్టర్ మారుతికి ట్యాగ్ చేసిన నెటిజన్!

  • కారు ఇంజిన్ కాలిపోయింది
  • డబ్బు ఎందుకు అడుగుతున్నారు?
  • స్విఫ్ట్ కంపెనీతో సంబంధం లేదు
  • సరైన వారికి చేరుతుందని ఆశిస్తున్నా

వ్యక్తుల పేర్లు, కంపెనీల పేర్లు కాస్త కన్ఫ్యూజ్ అవటం కామనే. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ పొరపాటు కాస్త ఎక్కువగా ఎదురవుతుంటుంది. అలాగే, ఓ నెటిజన్ మారుతి కంపెనీకి చేయాల్సిన ట్వీట్‌ను సినిమా డైరెక్టర్ మారుతికి చేశాడు. అయితే దీనిపై ఏమాత్రం ఫీలవకుండా మారుతి చాలా హూందాగా వ్యవహరించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 అసలు విషయంలోకి వెళితే.. ‘నా మారుతి స్విఫ్ట్‌ కారు ఇంజిన్‌ కాలిపోయింది. 2015 మేలో కొనుగోలు చేశాను. బీమా ఉంది కానీ కవరేజ్‌లో లేదు. దాంతో కారులోని భాగాలను మళ్లీ అమర్చేందుకు లక్షా ఎనభై వేల రూపాయలను అడిగారు. ఇంజిన్‌కు కనీసం ఐదేళ్ల వారెంటీ అయినా ఉంటుంది. అలాంటపుడు నా కారు విషయంలో మాత్రం వారు డబ్బు ఎందుకు అడుగుతున్నారు?’ అంటూ శరవణ కుమార్ అనే నెటిజన్ పొరపాటున మారుతి సంస్థకు ట్యాగ్‌ చేయాల్సింది పోయి.. సినీ డైరెక్టర్ మారుతి పేరుకు ట్యాగ్‌ చేశారు.

 దీనిపై మారుతి చాలా హూందాగా, మర్యాదగా స్పందించారు. పైగా ఆ నెటిజన్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ‘డియర్‌ సర్‌.. నేను సినిమా డైరెక్టర్‌ మారుతిని. నాకు మారుతి స్విఫ్ట్‌ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు. మీ ఫిర్యాదు సరైన వారికి చేరుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. హ్యాపీ న్యూఇయర్‌’ అని ట్వీట్‌ చేశారు. తాను తప్పులో కాలేశానని తెలుసుకున్న శరవణ వెంటనే తన ట్వీట్‌ను సదరు కంపెనీకి ట్యాగ్‌ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News