Dena Bank: ఆందోళనలు బేఖాతరు.. విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • గతేడాది స్టేట్ బ్యాంక్‌లో విలీనమైన అనుబంధ బ్యాంకులు
  • దేశంలోని మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరణ
  • ఏప్రిల్ నుంచి విలీనం అమలు

మరోమారు బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమైంది. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)ల విలీనానికి బుధవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. విలీనం తర్వాత ఈ మూడు కలిసి దేశంలోని మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనున్నాయి. విలీనం తర్వాత ఉద్యోగుల కోత ఉండదని మంత్రి స్పష్టం చేశారు. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు ఉద్యోగులు బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ అవుతారని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి విలీనం అమల్లోకి రానుంది. ఈ మూడింటి వ్యాపార లావాదేవీలు కలిపి రూ. 14.82 లక్షల కోట్లకు చేరుకోనుంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తర్వాత మూడో అతిపెద్ద బ్యాంకుగా రికార్డులకు ఎక్కనుంది. కాగా, ఈ మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల బ్యాంకు ఉద్యోగులు సమ్మె కూడా చేపట్టారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని కేంద్రం విలీనానికే మొగ్గుచూపింది. గతేడాది భారతీయ స్టేట్ బ్యాంకులో భారతీయ మహిళా బ్యాంకు సహా అనుబంధ బ్యాంకులు విలీనమయ్యాయి. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా మారింది.

Dena Bank
Vijaya Bank
Bank of Bank of Baroda
Ravi Shankar Prasad
SBI
  • Loading...

More Telugu News