shankar: శంకర్ .. హృతిక్ రోషన్ కాంబినేషన్లో సైంటిఫిక్ థ్రిల్లర్?

  • సెట్స్ పైకి వెళ్లనున్న 'భారతీయుడు 2'
  • తదుపరి సినిమా హృతిక్ తో 
  • ఉత్సాహం చూపుతోన్న నిర్మాతలు        

ప్రస్తుతం శంకర్ .. కమల్ తో 'భారతీయుడు 2' సినిమాను రూపొందించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తరువాత శంకర్ ప్రాజెక్టు హృతిక్ రోషన్ తో వుంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. '2.ఓ' సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర కోసం ముందుగా హృతిక్ ను శంకర్ సంప్రదించాడట.

అయితే అప్పుడు వేరే కమిట్మెంట్స్ వున్న కారణంగా చేయలేక పోతున్నానని చెప్పిన హృతిక్ రోషన్ మరో ప్రాజెక్టు చేద్దామని అన్నాడట. హృతిక్ రోషన్ ను సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమాలో చూడటానికి ఆడియన్స్ ఇష్టపడతారు గనుక, అందుకు సంబంధించిన కథ ఒకటి సిద్ధం చేసి ఆయనకి వినిపించినట్టు సమాచారం. సైంటిఫిక్ థ్రిల్లర్ కథ నచ్చడంతో హృతిక్ ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలామంది ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News