KS Bhagawan: మనిషిలా అన్ని సమస్యలతో బాధపడినవాడు దేవుడా?: రాముడిపై కర్ణాటక రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు

  • రామ మందిర యేకే  బేడ పేరుతో పుస్తకం
  • రాముడిని అవమానించారంటూ హిందూ సంస్థల ఆందోళన
  • రచయిత కేఎస్ భగవాన్‌పై కేసు నమోదు

అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత కేఎస్ భగవాన్ తన తాజా పుస్తకంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడలో ఆయన రాసిన ‘రామ మందిర యేకే  బేడ’ (రామ మందిర అవసరం ఏముంది?) పేరుతో రాసిన పుస్తకం ఇప్పుడు సంచలనమైంది. మానవుల్లా అన్ని కష్టాలు పడిన రాముడు దేవుడు ఎలా అవుతాడంటూ గొప్ప సందేహాన్ని ఆయన ఆ పుస్తకంలో వెలిబుచ్చారు.

‘రామ మందిర యేకే బేడ’ పుస్తకం వివాదాస్పదం కావడంతో ఆయనపై హిందూత్వ సంస్థలు మండిపడుతున్నాయి. ఆయన ఇంటిముందు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాముడు అసలు దేవుడే కాదని అర్థం వచ్చేలా రాసిన ఆయన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. రాముడిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైసూరు జిల్లా హిందూ జాగరణ్‌ వేదిక అధ్యక్షుడు కె.జగదీశ్‌ హెబ్బర్‌ భగవాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన తన రాతలతో తమ మనోభావాలను కించపరిచారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భగవాన్‌పై కేసు నమోదైంది.

భగవాన్ తన రాతలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించకపోవడంపై బీజేపీ మండిపడుతోంది. భగవాన్‌ను అరెస్ట్ చేయడమో, లేదంటే మానసిక ఆసుపత్రికి పంపడమో చేయాలని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే  ఎస్‌.సురేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

KS Bhagawan
Lord Rama
Ram Temple
Ayodhya
Kannada
BJP
Kumaraswamy
  • Loading...

More Telugu News