Sabarimala: తీవ్ర దుమారం, సంప్రోక్షణ... తిరిగి తెరచుకున్న అయ్యప్ప ఆలయం

  • ప్రస్తుతం భక్తులకు దర్శనమిస్తున్న అయ్యప్ప
  • పరిస్థితి అదుపులోనే ఉందన్న అధికారులు
  • తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పందళ రాజ వంశీకులు

ఈ తెల్లవారుజామున ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో స్వామిని దర్శించుకున్న తరువాత తీవ్ర దుమారం చెలరేగగా గర్భాలయ తలుపులను మూసివేసిన ప్రధాన పూజారులు, సంప్రోక్షణ తరువాత, తలుపులను తిరిగి తెరిచారు. ప్రధాన అర్చకుడి ఆదేశాలతో ఆలయాన్ని శుద్ధి చేసి, ఆపై భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సంప్రోక్షణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, జరిగిన ఘటనలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పందల రాజ వంశీకులు, అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను మార్చేందుకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు.

Sabarimala
Ayyappa
Samprokshana
Kerala
  • Loading...

More Telugu News