Addanki: అద్దంకి సీటు నాదే... జగన్ చెప్పేశారన్న గరటయ్య!

  • శింగరకొండ ప్రసన్నాంజనేయుడిని దర్శించుకున్న గరటయ్య
  • ఆపై ర్యాలీగా అద్దంకికి
  • రాజన్న పాలనను ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్య

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నానని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జ్ బాచిన చెంచు గరటయ్య ప్రకటించారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామిని దర్శించుకున్న ఆయన, ర్యాలీగా అద్దంకికి చేరుకుని మాట్లాడారు. తన అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరోసారి రాజన్న పాలనను కోరుకుంటున్నారని, అది జగన్ తోనే సాధ్యమని కూడా నమ్ముతున్నారని చెప్పిన గరటయ్య, నవరత్నాలు అమలైతే రాష్ట్ర భవిష్యత్ ఉజ్వలమవుతుందని చెప్పారు. జగన్ ను సీఎం చేయడమే తన లక్ష్యమని, అందుకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News