Supreme Court: ఏపీ లాయర్ల విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు

  • కోర్టు తరలింపునకు మరింత సమయం కోరిన న్యాయవాదులు
  • ఇప్పటికే హైకోర్టు మొదలైపోయిందన్న ధర్మాసనం
  • పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదన్న న్యాయమూర్తి

హైదరాబాద్ నుంచి ఏపీ హైకోర్టును తరలించేందుకు మరింత సమయం కావాలని న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఉదయం ఏపీ లాయర్ల పిటిషన్ పై విచారించిన ధర్మాసనం, ఇప్పటికే హైకోర్టు అక్కడ మొదలైపోయిందని, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయినందున ఈ పిటిషన్ ను విచారించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

కాగా, అమరావతిలో హైకోర్టు భవనం ఇంకా పూర్తి కాలేదని, వెంటనే అక్కడికి వెళ్లాలంటే తమకెన్నో ఇబ్బందులు ఉన్నాయని, కోర్టు తరలింపునకు మరింత సమయం కావాలని న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. న్యాయవాదులకు ఏమైనా సమస్యలు ఉంటే, ఏపీ ప్రభుత్వంతో చర్చించి, పరిష్కరించుకోవచ్చని, మరింత సమయం మాత్రం ఇవ్వలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

Supreme Court
Andhra Pradesh
High Court
Amaravati
  • Loading...

More Telugu News