Somireddy: సొంత వారికే మళ్లీ కండువా కప్పుతూ జగన్ వింత రాజకీయం: సోమిరెడ్డి సెటైర్

  • సోషల్ మీడియా ఫోటోలన్నీ ఫేక్
  • వెతికి చూసినా టీడీపీ వారు కనిపించడం లేదు
  • ముత్తుకూరులో ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తన పార్టీకి చెందిన వారికే మరోసారి కండువా కప్పి, పార్టీలోకి చేరికలంటూ, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వైఎస్ జగన్ వింత రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ముత్తుకూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, రోజూ తమ పార్టీ వారినే మళ్లీ, మళ్లీ పార్టీలో జగన్ చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 కొత్తగా వైకాపాలో చేరుతున్నారని చెబుతున్న వారిలో వెతికి చూసినా టీడీపీ వారు కనిపించడం లేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఖరితో విసిగిపోయిన ముఖ్యమైన నాయకులు అందరూ ఆ పార్టీని వీడి టీడీపీలో ఎన్నడో చేరిపోయారని, మరింతమంది వస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే జగన్ అభిమతమని అన్నారు. ప్రజలు జగన్ ను నిశితంగా గమనిస్తున్నారని, జగన్ కు వారు మరోసారి బుద్ధి చెప్పడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

Somireddy
Jagan
Social Media
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News