charan: ర్యాంబో లుక్ కోసం చరణ్ ఎంతో కష్టపడ్డాడట!

  • కండలు తిరిగిన దేహంతో చరణ్
  • రోజుకి 4 గంటలపాటు జిమ్ లోనే
  • బాలీవుడ్ హీరోలే స్ఫూర్తి

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ'ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పోస్టర్స్ లో చరణ్ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. కండలు తిరిగిన దేహంపై పచ్చబొట్లతో ర్యాంబోలా కనిపించి ఆశ్చర్యపరిచాడు. బాలీవుడ్ హీరోలు సల్మాన్ .. హృతిక్ .. టైగర్ ష్రాఫ్ స్ఫూర్తితో చరణ్ ఈ లుక్ ను ట్రై చేశాడట.

ఇలా కండలు తిరిగి కనిపించడం కోసం ఆయన ప్రతిరోజు 4 గంటలపాటు జిమ్ లో కసరత్తు చేశాడని అంటున్నారు. ఇంట్లోనే జిమ్ ఉండటంతో, ఆహార నియమాలు పాటిస్తూ మంచి కోచ్ పర్యవేక్షణలో చరణ్ ఎంతో శ్రమించాడని చెబుతున్నారు. చరణ్ లుక్ చూస్తుంటే .. మాస్ ఆడియన్స్ కి యాక్షన్ సీన్స్ తో ఆయన పండగ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక మరో వైపున సంప్రదాయ బద్ధమైన వస్త్రధారణతోను ఆయన పోస్టర్స్ లో కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించనున్నాడు. 

charan
kiara adwani
  • Loading...

More Telugu News