BSNL: మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులా...అయితే కొత్త ఆఫర్లు ఇవిగో!

  • కొత్త సంవత్సరం సందర్భంగా పలు ప్రయోజనాలు ప్రకటించిన సంస్థ
  • వెల్లడించిన తెలంగాణ సీజీఎం వి.సుందర్‌
  • అపరిమిత కాల్స్‌, ఉచిత కాలర్‌ టూన్స్‌ వంటి ఆకర్షణలు

తన వినియోగదారులను కాపాడుకోవడం, కొత్త వారిని ఆకర్షించడం క్ష్యంగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) నూతన సంవత్సరం సందర్భంగా మొబైల్‌ వినియోగదారులకులు ఆఫర్లను ప్రకటించింది. అపరమిత కాల్స్‌, డేటా, ఉచిత రింగ్‌టోన్స్‌ వంటి ప్రయోజనాతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన వివరాను తెలంగాణ టెలికాం సర్కిల్‌ సీజీఎం వి.సుందర్‌ వెల్లడించారు.

ఇందులో వర్షికా-1699 ప్లాన్‌ ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్లాన్ లో రూ.1,699 చెల్లించి ఏడాదిపాటు అపరిమిత (లోకల్‌ అండ్‌ రోమింగ్‌) వాయిస్‌కాల్స్‌, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, ఉచిత కాలర్‌ట్యూన్‌, అపరిమిత డేటా పొందవచ్చు. అయితే డేటా వినియోగదారులు ఒకరోజులో 2జీబీ డేటా ఉపయోగించాక వేగం 80 కేబీపీఎస్‌కు తగ్గిస్తారు. ఇవే ఆఫర్లు వర్షికా ప్లస్‌-2099 ప్లాన్‌కూ వర్తిస్తాయి. రూ.2,099తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 4జీబీ వినియోగించాక డేటా వేగం 80 కేబీపీఎస్‌కు కుదిస్తారు. రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే 487 వైఫై హాట్‌స్పాట్‌లను నెలకొల్పింది. మరో 423 హాట్‌స్పాట్‌లను ఫిబ్రవరిలోగా ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా 100 మీటర్ల పరిధిలో 2 నుంచి 10 ఎంబీపీఎస్‌ వేగంతో రోజుకు 4జీబీ డేటా చొప్పున బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు పొందొచ్చు.

రూ.300 టాప్‌ అప్‌తో రూ.30, గురు, శుక్ర, శనివారాల్లో రూ.250, సోమ, మంగళ, బుధవారాల్లో రూ.500, రూ.600 టాప్‌అప్‌ చేయించుకుంటే పదిశాతం అదనంగా టాక్‌టైం లభిస్తుంది. కాంబో ఎస్టీవీ-175లో రూ.200, కాంబో ఎస్టీవీ-219లో రూ.250 టాక్‌టైంతో పాటు 0.5 జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో లభిస్తోంది. కాంబో ఎస్టీవీ-252లో రూ.350 టాక్‌ టైం, 2 జీబీ డేటా, కాంబో ఎస్టీవీ-402లో రూ.600 టాక్‌ టైం, 4జీబీ డేటా 60 రోజుల కాలపరిమితితో అందిస్తున్నారు.


  • Error fetching data: Network response was not ok

More Telugu News