Triple Talaq: ట్రిపుల్ తలాక్, శబరిమల వివాదాలపై తొలిసారి పెదవి విప్పిన ప్రధాని

  • సమానత్వం, సామాజిక న్యాయం కోసమే ట్రిపుల్ తలాక్
  • చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాయి
  • ఆచార వ్యవహారాలకు సంబంధించినది శబరిమల  

దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన ట్రిపుల్ తలాక్, శబరిమల వివాదంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ రెండూ వేర్వేరు విషయాలని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ లింగ సమానత్వానికి సంబంధించినదని, శబరిమల వివాదం విశ్వాసాలకు సంబంధించిన విషయమని అన్నారు. మంగళవారం ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో తొలిసారి శబరిమల, ట్రిపుల్ తలాక్ వివాదాలపై ఆయన స్పందించారు.

ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు ఇప్పటికే నిషేధించాయని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ ఓ మతానికి, విశ్వాసానికి సంబంధించిన విషయం కాదన్నారు. ఇది సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం తప్ప మరెందుకోసమూ కాదని స్పష్టం చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై స్పందిస్తూ ఇది ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయమని ప్రధాని వివరించారు. కొన్ని ఆలయాలకు కొన్ని సంప్రదాయాలు ఉంటాయన్న ప్రధాని మోదీ.. ఈ విషయంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సూక్షంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News