Maharashtra: ఒకే రకం దుస్తులతో, ఒకేలా డ్యాన్స్... ఫడ్నవీస్ భార్య అమృత, కుమార్తె దివిజల వైరల్ వీడియో!

  • బంధువుల వివాహానికి హాజరైన అమృత, దివిజ
  • సంగీత్ లో దుమ్ము దులిపిన తల్లీకూతుళ్లు
  • అచ్చం దీపికలానే చేశారని ప్రశంసలు

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత, కుమార్తె దివిజ‌ల డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వారి బంధువుల వివాహానికి హాజరైన వీరు సంగీత్ లో దుమ్ము దులిపారు. 'బాజీరావ్ మస్తానీ' చిత్రంలోని టైటిల్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. ఈ తల్లీకూతుళ్లు ఒకే రకం దుస్తులు ధరించి, ఒకేలా డ్యాన్స్ చేయడం గమనార్హం. ఆపై అమృత తన ఫేస్‌ బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. వీరిద్దరూ అచ్చం దీపికా పదుకొణె తరహాలోనే నృత్యం చేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ వైరల్ వీడియోను మీరూ చూడవచ్చు.

Maharashtra
Devendra Fadnavis
Amruta
Divija
  • Error fetching data: Network response was not ok

More Telugu News