Kader Khan: నా తల్లి చనిపోయిందని చెప్పినా ఎవరూ నమ్మలేదు: పాత ఇంటర్వ్యూలో ఖాదర్ ఖాన్ ఆవేదన

  • ఏప్రిల్ 1న మరణించిన ఖాదర్ ఖాన్ తల్లి
  • ఫూల్స్ డే కావడంతో ఆ విషయాన్ని ఎవరూ నమ్మని వైనం
  • ఆ విషయం చెబుతూ భావోద్వేగానికి గురైన ఖాదర్ 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ (81) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. కెనడాలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు ఆయన కుమారుడు సర్ఫరాజ్ ప్రకటించారు. 17 వారాలపాటు ఆసుపత్రిలో ఉన్న ఆయన ఆదివారం కోమాలోకి వెళ్లారు. సోమవారం మృతి చెందారు.  

ఇదిలా ఉంచితే, ఖాదర్ ఖాన్‌కు చెందిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ వైరల్ అవుతోంది. ఏప్రిల్ 1న తన తల్లి మృతి చెందిందని, ఆ విషయాన్ని చెబితే ఎవరూ నమ్మలేదని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు. ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే కావడంతో తన తల్లి మరణాన్ని కూడా ఎవరూ నమ్మలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ విషయాన్ని అందరూ సరదాగానే తీసుకున్నారని అన్నారు. ఏప్రిల్ 1 తన జీవితాన్ని అలా పరిహసించిందని ఖాదర్ ఖాన్ ఆ ఇంటర్వ్యూలో వాపోయారు. 

Kader Khan
Bollywood
interview
mother
April 1
  • Loading...

More Telugu News