Andhra Pradesh: నూతన సంవత్సరం వేళ పోటెత్తిన తిరుమల.. శ్రీవారి సేవలో బోనీ కపూర్ కుటుంబం

  • శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
  • మంగళవారం 90 వేల మంది దర్శనం
  • మూడు నాలుగు గంటల్లోనే స్వామి దర్శనభాగ్యం

న్యూ ఇయర్ వేళ శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మంగళవారం 90 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వీకపూర్, ఖుషి కపూర్‌లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నటి మహేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

అర్ధరాత్రి 12 గంటలకు ఆలయం తెరిచిన అనంతరం ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభించారు. 1:30 గంటలకు వీఐపీలను దర్శనానికి అనుమతించారు. ప్రత్యేక దర్శనాలు లేకపోవడంతో మూడునాలుగు గంటల్లోనే భక్తులకు స్వామి దర్శన భాగ్యం లభించింది. ఉదయం 11 గంటల వరకు భక్తులతో కిటకిటలాడిన క్యూలు ఆ తర్వాత బోసిపోయాయి.  

Andhra Pradesh
Tirumala
Tirupati
Bony kapur
KE Krishnamurthy
  • Loading...

More Telugu News