Andhra Pradesh: మద్యం మత్తులో తెనాలి ఆసుపత్రిలో మందుబాబు వీరంగం.. భార్యపై దాడి, పరిస్థితి విషమం

  • ఫర్నిచర్ ధ్వంసం
  • అత్తమామలపైనా దాడి
  • బాధితురాలిని గుంటూరు తరలించిన వైద్యులు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిండు చూలాలు అయిన భార్యపై దాడిచేశాడో తాగుబోతు భర్త. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ఆసుపత్రిలో వీరంగమేశాడు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నిండు గర్భిణి అయిన పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పూటుగా మద్యం తాగొచ్చిన ఆమె భర్త వీరాస్వామి ఆసుపత్రిలోకి వచ్చీ రావడంతోనే ఆమెపై దాడికి దిగాడు. ఆసుపత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన సిబ్బందిపైనా దాడికి దిగాడు. చికిత్స పొందుతున్న కుమార్తెను చూసేందుకు వచ్చిన పద్మావతి తల్లిదండ్రులు, అమ్మమ్మపైనా వీరాస్వామి దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన పద్మావతి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు వీరాస్వామిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Guntur District
Tenali
Hospital
Police
Arrest
  • Loading...

More Telugu News